జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభు త్వ సాంఘిక సంక్షేమ బాలుర సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) గురుకుల కళాశాల వి ద్యార్థి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కందుల శ్రీహర్ష ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 9, 11 తేదీల్లో బెల్లంపల్లిలోని తె లంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం (టీజీఎస్‌ఆర్)లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఆడి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు సీవోఈ ప్రిన్సిపాల్ వి జయ్‌సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా కళా శాలలో శ్రీహర్షకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రి న్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈనెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో అండర్–19 విభా గంలో శ్రీహర్ష పాల్గొననున్నాడు. సీవోఈ వైస్ ప్రిన్సిపాల్ గోపి, ఉపాధ్యాయులు దశరథం, కమలాకర్, తిరుపతి, లక్ష్మణ్, హారిక, శశికుమార్, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీలత, వ్యాయా మ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


