తల్లులకు ప్రణమిల్లి.. | - | Sakshi
Sakshi News home page

తల్లులకు ప్రణమిల్లి..

Jan 31 2026 10:19 AM | Updated on Jan 31 2026 10:19 AM

తల్లు

తల్లులకు ప్రణమిల్లి..

● మొక్కులు తీర్చుకునేందుకు బారులు ● మూడో రోజు భక్తుల హోరు ● కోలహలంగా గోదావరి నదీ తీరం

మంచిర్యాలలో సమ్మక్క, సారలమ్మ దర్శించుకుంటున్న భక్తులు

మంచిర్యాలఅర్బన్‌/రామకృష్ణాపూర్‌: జిల్లా కేంద్రం మంచిర్యాల గోదావరి నదీ తీరాన సమ్మక–సారలమ్మ దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. బంగారం, ముడుపులతో తల్లులకు ప్రణమిల్లారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి తీరమంతా జనసందోహంతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఈవో ముక్తారవి, జాతర పర్యవేక్షకుడు రవికిషన్‌ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలోని ఆర్‌కే1ఏ గని శివారు పాలవాగు ఒడ్డున సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ జాతర సందడిగా కొనసాగుతోంది. మూడో రోజు శుక్రవారం దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు. రామకృష్ణాపూర్‌, మందమర్రితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దయెత్తున తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. సింగరేణి అధికారులు, వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు దర్శించుకున్నారు. ఏరియా జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, ఎస్‌ఓటు జీఎం జీఎల్‌ ప్రసాద్‌, డీజీఎం అశోక్‌ ఆయా గనులు, డిపార్ట్‌మెంట్ల అధికారులు పాల్గొన్నారు.

మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే

భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధి చర్లపల్లిలో సమ్మక్క–సారలమ్మలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ శుక్రవారం మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల చుట్టూ ప్రదక్షిణ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ నర్సింగరావు, సర్పంచ్‌ బోరిగామ వెంకటేష్‌, నాయకులు పాల్గొన్నారు.

తల్లులకు ప్రణమిల్లి..1
1/3

తల్లులకు ప్రణమిల్లి..

తల్లులకు ప్రణమిల్లి..2
2/3

తల్లులకు ప్రణమిల్లి..

తల్లులకు ప్రణమిల్లి..3
3/3

తల్లులకు ప్రణమిల్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement