గాంధారి మైసమ్మ జాతర షురూ
రామకృష్ణాపూర్: ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యధైవమైన గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులో మూడు రోజుల పాటు నిర్వహించే జాతరలో మొదటిరోజు శుక్రవారం ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. సదర్ భీమ న్న ఆలయంలో పూజల అనంతరం దేవతామూర్తు ల ఊరేగింపు నిర్వహించారు. తప్పెటగూళ్ళ ఆట లు, పిల్లనగ్రోవి వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడు మ బొక్కలగుట్ట నుంచి ప్రారంభమైన ఊరేగింపు గాంధారివనం, గద్దెరాగిడి, ఏసీసీ మీదుగా మంచిర్యాల గోదావరి వరకు సాగింది. అక్కడ గిరిజనులు గోదావరినదిలో దేవతామూర్తులకు సంప్రదా యబద్ధంగా నైవేద్యం సమర్పించారు. గోదావరిలో పూజల అనంతరం రాత్రి అక్కడి నుంచి తిరిగి సదర్‌భీమన్న ఆలయం వద్దకు దేవతామూర్తులను తీసుకువచ్చారు. శనివారం ఉదయం గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భీమన్న దేవునికి పట్నాలు వేస్తారు. సాయంత్రం గోదావరి జలాలతో దేవతామూర్తులకు మరోసారి అభిషేకాలు చేసి జాతర జరిగే ఖిల్లా దిగువ ప్రాంతానికి తరలివెళ్లనున్నారు. రాత్రి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన లక్ష్మీదేవర కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం పూజారులతో మైసమ్మ తల్లికి పెద్దపూజ నిర్వహిహించనున్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


