సోలార్ ప్యానెల్ ఏర్పాటు
లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావుపేటలో టీజీ రెడ్‌కో ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ప్యానెల్‌ను సోలార్ విద్యుత్ అధికారులు ఆదివారం ఏర్పాటు చేశారు. సోలార్ గ్రామంగా ఏర్పాటైన జిల్లాలోని ఏకై క గ్రామం కావడంతో పనులు ప్రారంభించి గ్రామానికి చెందిన కిష్టయ్య అనే వ్యక్తి ఇంటిలో సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోలార్ మీటర్‌ను త్వరలో ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా అందిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ డీఈ ప్రభాకర్, ఏఈ గణేశ్, లైన్ ఇన్‌స్పెక్టర్ సతీశ్, సోలార్ సిబ్బంది పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌లో తిరుపతి ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: రాజస్థాన్‌లో జనవరి 30నుంచి నిర్వహిస్తున్న ఏడో నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మంచిర్యాల డిపోలో విధులు నిర్వహించే ఆర్టీసీ కానిస్టేబుల్ తిరుపతి ప్రతిభ కనబరిచారు. ట్రిపుల్‌జంప్‌లో తృతీయ స్థానంలో నిలిచి బ్రాస్ మెడల్ సాధించారు. నేషనల్ నమ ప్రెసిడెంట్ సురేశ్‌శర్మ, తెలంగాణ స్టేట్ సెక్రటరీ లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు.


