అనారోగ్యంతో తల్లి మరణం.. దుఃఖంలోనూ నామినేషన్
కాగజ్‌నగర్‌టౌన్: అనారోగ్యం తల్లి చనిపోయి తీవ్ర దుఃఖంలోనూ ఓ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లో నా మినేషన్ దాఖలు చేశారు. కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని 25వ వార్డుకు చెందిన కుడుక శ్రీను తల్లి తారాబాయి గురువారం రా త్రి అనారోగ్యంతో మృతిచెందింది. శుక్రవారం నా మినేషన్లకు చివరిరోజు కావడంతో ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే.. కాలనీ ప్రజలకు సేవ చేయాలనే తపనతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం తిరి గి వచ్చి మధ్యాహ్నం తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.


