పారదర్శకంగా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

పారదర్శకంగా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

పారదర్శకంగా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల(ప్రాక్టికల్స్‌)ను పారదర్శకంగా నిర్వహించాలని డీఐఈవో అంజయ్య సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్ష నిర్వహణ మార్గదర్శకాలపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, పరీక్షల నిర్వహణ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ నెల 2నుంచి 21 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని, 20 పరీక్ష కేంద్రాల్లో 5,398 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. సందేహాలు, సలహాలకు జిల్లాలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, 8328172384, 9291658408 నంబర్లలో సంప్రదించాలని తలెఇపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శంకర్‌, విజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement