ఎడ్లబండిపై వెళ్లి సబ్ కలెక్టర్ పరిశీలన
భీమిని: కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి, గొల్ల గట్టు గ్రామాల్లో పలు వివాదాస్పద భూములను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ శనివారం ఎడ్లబండిపై వెళ్లి పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక తహసీల్దార్ రాంచందర్‌తో కలిసి వెళ్లారు. వాహనాలు వెళ్లే దారి లేకపోవడంతో ఎడ్లబండిలో వాగు దాటి వెళ్లి పరిశీలించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు వేడుకున్నారు. తహసీల్దార్ రాంచందర్, ఆర్‌ఐ చంద్రమౌళి, నాయకులు నర్సింగరావు, బానేష్ తదితరులు పాల్గొన్నారు.


