అదృష్టమంటే ఆ దంపతులదే.. | - | Sakshi
Sakshi News home page

అదృష్టమంటే ఆ దంపతులదే..

Jan 31 2026 10:29 AM | Updated on Jan 31 2026 10:29 AM

అదృష్

అదృష్టమంటే ఆ దంపతులదే..

● వరుసగా పదేళ్లు పురపాలన సాగించిన భార్యాభర్తలు

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్‌ చరిత్రలో ఆ దంపతులు ప్రత్యేకత చాటుకున్నారు. భార్యాభర్తలు వరుసగా పదేళ్లు మున్సిపల్‌ పీఠాన్ని అధిరోహించి ఏకచత్రాధిపత్యంగా పుర రాజకీయాలను శాసించారు. 2001లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గృహిణిగా ఉన్న మత్తమారి సరస్వతి అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటికే ఆమె భర్త మత్తమారి సూరిబాబు కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు. అదృష్టం కలిసి రావడంతో రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సరస్వతి ఎన్నికల్లో పోటీచేసి చైర్‌పర్సన్‌ అయ్యారు. 2005లో జరిగిన ఎన్నికల్లోనూ సూరిబాబు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇలా దంపతులిద్దరూ మున్సిపల్‌ రాజకీయాల్లో తమదైన శైలిలో రాణించి రికార్డు సృష్టించారు.

సూరిబాబును వరించిన అదృష్టం

2005లో మున్సిపల్‌ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగాయి. మత్తమారి సూరిబా బు (కాంగ్రెస్‌), పసుల సురేష్‌ (టీఆర్‌ఎస్‌) మున్సిపాలిటీలో ని 15వ వార్డు నుంచి పోటీ చే శారు. సమ ఉజ్జీలు కావడంతో ఆ వార్డు ఓటర్లు ఇద్దర్నీ సమానంగా ఆదరించారు. చెరో 209 చొప్పున ఓట్లు వచ్చాయి. విజేతను ప్రకటించడానికి మున్సిప ల్‌ ఎన్నికల అధికా రులు డ్రా తీశారు. అందులో సూరిబాబు పేరు రావడంతో కౌన్సిలర్‌గా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఆ తీరుగా డ్రా రూపంలో సూరి బాబును అదృష్టం వరించింది. కౌన్సిలర్‌గా ఎన్నికై న సూరిబాబు మిగతా కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. ఆ ప్రకారంగా భార్యాభర్తలు పదేళ్ల పాటు పుర పాలన పగ్గాలు చేపట్టారు. అంతటి అరుదైన అవకాశం ఇంతవరకు మరెవరికీ దక్కక పోవడం గమనార్హం.

అదృష్టమంటే ఆ దంపతులదే..1
1/1

అదృష్టమంటే ఆ దంపతులదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement