గొల్లాపూర్‌ చెరువులో సందడి | - | Sakshi
Sakshi News home page

గొల్లాపూర్‌ చెరువులో సందడి

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

గొల్లాపూర్‌ చెరువులో సందడి

గొల్లాపూర్‌ చెరువులో సందడి

సొనాల మండలం గొల్లాపూర్‌ చెరువులో స్మూత్‌ కోటెడ్‌ ఒటర్‌ (మృదుచర్మ నీటి పిల్లులు) సందడి చేస్తున్నాయి. నదీ తీరప్రాంతాలకే పరిమితమయ్యే ఇవి చెరువులో అరుదుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ పుష్కలంగా చేపలు ఉండటం, సురక్షితమైన ఆవాసం లభించడంతోనే అవి ఇక్కడికి వలసవచ్చి ఉంటాయి. చెరువులో స్వేచ్ఛగా విహరిస్తూ కేరింతలు కొడుతున్న దృశ్యాలు పర్యావరణ ప్రేమికులు, గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి. నీటి శుభ్రత ఎక్కడైతే ఉంటుందో, ఇవి అక్కడ సంచరిస్తుంటాయని బోథ్‌ ఎఫ్‌ఆర్వో ప్రణయ్‌కుమార్‌ తెలిపారు. – బోథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement