● నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్ ● జిల్లాకు ప్రత్యేకంగా న
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బడ్జెట్‌తో జిల్లా కు ఎలాంటి ఊరట దక్కలేదు. జాతీయ రహదారులు, సింగరేణి గనులు, కార్మికుల ఆదాయపన్ను మినహాయింపు లాంటి అంశాలు ప్రస్తావనకు రాలే దు. దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాలే జిల్లాకు ఒనగూరనున్నాయి. ఇంతకుమించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకించి ఎలాంటి నిధులు, ప్రకటించలేదు. ఆదివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులను నిరాశ పరిచింది. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు లేదా కోల్‌ఇండియా తరహాలో యాజమాన్యం చెల్లించేలా వెసులుబాటుపై ప్రస్తావన రాలేదు. అలాగే, కొత్త బొగ్గు గనులు ప్రకటించలేదు. వచ్చే ఏడాది జూన్‌లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం గోదావరినది తీర ప్రాంత దర్శనీయ ప్రదేశాలు, పర్యాటకం, అభివృద్ధిపై ప్రస్తావన రాలేదు. అయితే బడ్జెట్ సప్లిమెంటరీలో ఏవైనా నిధుల ప్రస్తావన వస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.
జాతీయ రహదారుల అంశమేది?
జిల్లాలో జాతీయ రహదారి 363 పూర్తయింది. నిజా మాబాద్–జగ్దల్‌పూర్ మధ్య నిర్మించే జిల్లా గుండా వెళ్తున్న నాలుగు వరుసలదారి 63 నిర్మాణ పనులు మొదలుకావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా మొదలు కావడం లేదు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో టెండర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జాతీయ రహదారుల నిర్మాణ నిధుల అంశం ఈ బడ్జెట్‌లోనూ చేర్చలేదు. ఇక బె ల్లంపల్లి–గడ్చిరోలి ఫోర్‌లేన్ రోడ్డు కూడా ఈ ఆర్థికసంవత్సరంలో ప్రారంభమయ్యేలా లేదు.
రైల్వే కేటాయింపులు,
నిధుల ఖర్చు వెల్లడించలే..
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులు, నిధుల ఖర్చు తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు వెల్లడించే పింక్ బుక్ ఈసారి పూర్తిగా ఎత్తివేశారు. దీంతో రైల్వే కేటాయింపులపై స్పష్టత రావడం లేదు. ఈ మేరకు కేటాయింపుల నోట్ విడుదలైతే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని మంచిర్యాల నుంచి సిర్పూర్ (టీ) వరకు ఉన్న లైన్, స్టేషన్లు, మూడు, నాలుగో లైన్ ప్రారంభం, అభివృద్ధి తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. ఇక 7హైస్పీడ్ రైళ్లు నడిచేలా కారిడార్‌ను ప్రధాన నగరాలకు కేటాయించారు. సికింద్రాబాద్–ఢిల్లీ, నాగ్‌పూర్ లాంటి నగరాల మధ్య ఎలాంటి ప్రకటన రాలేదు.


