గూడెంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. గుట్టకింది నుంచి సన్నాయి వాయిద్యాలతో పూజాసామగ్రి, స్వామివారి చిత్రపటంతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు న్న మండపం వద్ద సప్తాహ భజనలు ప్రారంభించారు. అనంతరం నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి, విశ్వక్సేనారాధ న, దీక్ష కంకణ ధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, వ్య వస్థాపక కుటుంబసభ్యులు రఘుస్వామి, సంపత్‌స్వామి, వేదపండితులు నారాయణశర్మ, భరత్‌శర్మ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అ ర్చకులు, భజన కళాకారులు పాల్గొన్నారు.


