సమ్మె విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

సమ్మె విజయవంతం చేయండి

Jan 29 2026 6:41 AM | Updated on Jan 29 2026 6:41 AM

సమ్మె విజయవంతం చేయండి

సమ్మె విజయవంతం చేయండి

నస్పూర్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్‌ఎంఎస్‌ జనరల్‌ సెక్రెటరీ రియాజ్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన అధ్యక్షుడు తిప్పారపు సారయ్యతో కలిసి కొత్తగూడెంలోని కార్యాలయంలో కార్పొరేట్‌ జీఎం పర్సనల్‌ కవితానాయుడుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తగూడెం వైస్‌ ప్రెసిడెంట్‌ ఆంజనేయులు, శ్రీరాంపూర్‌ ఏరియా కార్యదర్శి అశోక్‌, నాయకులు శ్రీనివాస్‌ పూర్ణ చందర్‌, సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement