చిరుతనా..తోడేళ్లా?
బోథ్: మండలంలోని నాగపూర్‌కండి ప్రాంత పరిసరాల్లో ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వాకర్స్‌కు జంతువుల పాదముద్రలు కనిపించా యి. గుట్ట ప్రాంతంలో దూరంగా రెండు చిరుతలు, మూడు చిరుత పిల్లలు కనిపించినట్లు వారు తెలిపారు. పలు చోట్ల పాదముద్రలను గుర్తించి ఫోన్‌లో ఫోటోలు తీశారు. అరుపులు కూడా వినిపించాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ అధికారి నాగోరావును వివరణ కోరగా పాదముద్రలు చిరుతవి కాదని, తోడేళ్లకు సంబంధించినవని తెలిపారు. అయితే, చిరుతలను చూశామని వాకర్స్ అంటుండగా, అటవీ అధికారులు తోడేళ్ల పాదముద్రలుగా పేర్కొనారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది చిరుతలా? లేక తోడేళ్ల అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
ద్విచక్రవాహనం చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో ద్విచక్రవాహనం చోరి జరిగింది. రైల్వేక్వార్టర్స్‌కు చెందిన భీంరావు పని నిమిత్తం గతనెల 20న ఊరికి వెళ్లాడు. 31న తిరిగి ఇంటికి వచ్చాడు. పార్కింగ్ చేసిన తన బైక్ కనిపించకపోవడంతో చుట్టూపక్కల గాలించిన ఆచూకీ దొరకలేదు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు.


