నిజాం పాలన నుంచి | - | Sakshi
Sakshi News home page

నిజాం పాలన నుంచి

Feb 1 2026 3:39 AM | Updated on Feb 1 2026 3:39 AM

నిజాం పాలన నుంచి

నిజాం పాలన నుంచి

● నస్పూర్‌లో మొదటివే.. చివరి ఎన్నికలు..

నస్పూర్‌: సుమారు 1900 సంవత్సరకాలంలో నిజాం సంస్థానీశులు విలేజ్‌ నస్పూర్‌లోని గడి నుంచి జన్నారం, తపాలాపూర్‌, ఇందారం, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలో ని సిరొంచ, మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌ వరకు పాల న కొనసాగించేవారు. కాలక్రమేణా 1986లో న స్పూర్‌ పంచాయతీగా, 2018లో నస్పూర్‌, తీగల్‌పహడ్‌, తాళ్లపల్లి, సింగాపూర్‌ గ్రామాలు కలిపి మున్సిపాలిటీగా ఏర్పడింది. 2020లో ఎన్నికలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ నుంచి ప్రభాకర్‌ తొలి చై ర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ నుంచి సురమిల్ల వేణు చైర్మన్‌గా ఏడాది బాధ్యతలు నిర్వహించారు. 2025 జనవరి 27న మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీలతోపాటు మరో ఏడు గ్రామాలు కలిసి మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పడింది. దీంతో నస్పూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే చివరిగా మిగిలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement