పంచాయతీ నుంచి కార్పొరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ నుంచి కార్పొరేషన్‌

Jan 29 2026 6:39 AM | Updated on Jan 29 2026 6:39 AM

పంచాయతీ నుంచి కార్పొరేషన్‌

పంచాయతీ నుంచి కార్పొరేషన్‌

● మంచిర్యాలకు 73 ఏళ్ల ప్రస్థానం ● 1952లో మున్సిపాలిటీగా అవతరణ ● కాంగ్రెస్‌ పార్టీ నుంచి జి.నరసింహారెడ్డి 1963–1971వరకు, సి.చంద్రయ్య కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లి 1982–85 వరకు చైర్మన్‌గా ఉన్నారు. అవిశ్వాసం ద్వారా ఆయనను తొలగించి కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కొప్పుల రాజలింగు 1985–86వరకు పని చేశారు. ● కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆర్‌.కృష్ణారావు 1995–2000, స్వంతంత్ర అభ్యర్థి మంగీలాల్‌ సోమాని 2000–05, అనంతరం కాంగ్రెస్‌ నుంచే మరోసారి ఆర్‌.కృష్ణారావు 2005–10 వరకు పని చేశారు. ● 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మామిడిశెట్టి వసుంధర 2015–19 వరకు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ● 2020లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పెంట రాజయ్య బాధ్యతలు స్వీకరించి 2024వరకు పని చేశారు. అవిశ్వాస తీర్మానంతో 2024–25 వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రావు ల ఉప్పలయ్య చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

మంచిర్యాలటౌన్‌: ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న మంచిర్యాల 73ఏళ్ల తర్వాత గత ఏడాది జనవరి 27న కార్పొరేషన్‌గా అవతరించింది. రైల్వే సౌకర్యం ఉండడం, సిమెంటు కంపెనీ ఏర్పాటు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండడం, ఇతర ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడడం వల్ల జనాభా పెరుగుతూ శరవేగంగా అభివృద్ధి చెందింది. 1952లో 1500 జనాభాతో ఉన్న గ్రామ పంచాయతీని గ్రేడ్‌–3 మున్సిపాల్టీగా ప్రభుత్వం మార్చింది. మొదటిసారిగా మున్సిపాల్టీకి 1956లో ఎన్నికలు నిర్వహించారు. 1984లో మండల కేంద్రంగా, 1992లో రెవెన్యూ డివిజన్‌గా, 2016లో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. గ్రేడ్‌–3 మున్సిపాల్టీగా ఉండగా 2004లో గ్రేడ్‌–1 స్థాయికి చేరింది. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా.. 2.50లక్షల మంది జనాభా, 601,81,778 మంది ఓటర్లు ఉన్నారు.

12మంది చైర్‌పర్సన్‌లు

మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రజాసోషలిస్టు పార్టీ నుంచి కేవీ.రమణయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1956–57 మధ్యకాలంలో పని చేశారు. తర్వాత అదే పార్టీకి చెందిన ఎస్‌.లక్ష్మికాంతం, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎం.అర్జున్‌రావు 1957నుంచి 1962వరకు పని చేశారు.

విలీనం

పాలకవర్గం పదవీకాలం ముగిసిన వెంటనే గత ఏడాది జనవరి 27న మంచిర్యాల మున్సిపాల్టీలో నస్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్‌ మండలం వేంపల్లి, ముల్కల్ల, చందనాపూర్‌, గుడిపేట్‌, నర్సింగాపూర్‌, నంనూర్‌, కొత్తపల్లి, పోచంపాడ్‌ గ్రామాలను విలీనం చేస్తూ మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చారు. మొదటిసారి కార్పొరేషన్‌కు ఎన్నికల జరుగుతుండగా.. మేయర్‌ స్థానాన్ని బీసీ జనరల్‌ కేటాయించారు. మేయర్‌ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement