చికిత్సతోనే టీబీ నివారణ
నెన్నెల: టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నివారించవచ్చని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం ఆవుడంలో ఏర్పాటు చేసిన ముక్త భారత్ అభియాన్‌లో పాల్గొని అవగాహన కల్పించారు. ప్రతీ పీహెచ్‌సీలో తెమడ, ఎక్స్‌రే పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే పూర్తిగా నయం అయ్యే వరకు ప్రతీనెల రూ.వెయ్యి చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. 22 మందికి తెమడ పరీక్ష, 116 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ లక్ష్మణ్, సర్పంచ్ పావని, తదితరులు పాల్గొన్నారు.


