జాతరే చివరి యాత్ర | - | Sakshi
Sakshi News home page

జాతరే చివరి యాత్ర

Jan 29 2026 6:41 AM | Updated on Jan 29 2026 6:41 AM

జాతరే

జాతరే చివరి యాత్ర

మేడారానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ట్రాక్టర్‌ బోల్తాపడి తల్లీకుమార్తె మృతి కౌటాల మండలం ముత్తంపేటలో విషాదం

కౌటాల: అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారం మహాజాతరకు బయల్దేరిన తల్లీకుమార్తెకు అదే చివరి యాత్రగా మిగిలింది. ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి రమేశ్‌, అతడి భార్య సునీత(45), వారి ఏకై క కుమార్తె అక్షిత(21)తోపాటు అదే గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మి, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనవరాళ్లు ఎనిమిది మంది ఈ నెల 26న మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి ట్రాక్టర్‌లో మొత్తం 25 మంది మంగళవారం జాతరకు బయల్దేరారు. మంగళవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి– కేశవాపూర్‌ అటవీ ప్రాంతంలో ట్రాక్టర్‌ను రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు సునీత, అక్షిత ట్రాలీ కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. రమేశ్‌ ఎడమ కాలు, కస్తూరి లక్ష్మి కుడి చేయి విరిగింది. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ముత్తంపేటలో విషాదం..

రమేశ్‌, సునీత కూలీ పని చేస్తూ వారి ఏకై క కుమార్తె అక్షితను హైదరబాద్‌లో డీఈడీ మొదటి సంవత్సరం చదివిస్తున్నారు. తల్లీకుమార్తెల మృతితో ముత్తంపేట గ్రామంలో విషాదం నెలకొంది. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అనంతరం బుధవారం సాయంత్రం ము త్తంపేటకు తరలించారు. జాతరకు వెళ్లి తల్లీకుమార్తెలు అనంతలోకాలకు వెళ్లడంతో బంధువులు బోరు న విలపించారు. కళ్లెదుటే కట్టుకున్న భార్య, అల్లారుముద్దుగా పెంచిన కుమార్తె చనిపోవడంతో రమేశ్‌ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాలకు సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న రమేశ్‌ను ఎమ్మెల్సీ దండె విఠల్‌ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

జాతరే చివరి యాత్ర1
1/2

జాతరే చివరి యాత్ర

జాతరే చివరి యాత్ర2
2/2

జాతరే చివరి యాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement