‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ | - | Sakshi
Sakshi News home page

‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

‘చేయి

‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ

● మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా సీపీఐ రెండు కోరుతోంది. ఓ డివిజన్‌ ఇవ్వడంతోపాటు నామినేటెడ్‌ పదవి కేటాయింపునకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. నస్పూర్‌ ప్రాంతంలో సీపీఐకి ఉన్న బలం దృష్ట్యా మరో డివిజన్‌ అప్పగిస్తే కాంగ్రెస్‌, సీపీఐ ఉత్సాహంగా ఎన్నికల్లో తలపడడానికి వీలుంటుందని కామ్రేడ్లు భావిస్తున్నారు. ఈ విషయంలో సోమవారం వరకు తుడి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ● క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 10 వార్డులు సీపీఐ కోరగా.. ఏడు వార్డులు కేటాయించడానికి బీఆర్‌ఎస్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. మరో రెండు వార్డులు కూడా కేటాయించాలని సీపీఐ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పొత్తు చెడిపోకుండా సానుకూల వైఖరితో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ● బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు గాను సీపీఐ ఏడు వార్డులు కోరుతుండగా మూడు వార్డులు కేటాయించడానికి బీఆర్‌ఎస్‌ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అదనంగా మరో వార్డు కేటాయించాలని సీపీఐ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు లేకపోవడంతో మధ్యేమార్గంగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఇరు పక్షాలు ఆరాటపడుతున్నాయి. పట్టు విడుపులతో వ్యవహరిస్తే తప్ప పొత్తు కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. ● చెన్నూర్‌ మున్సిపాలిటీలో 3 వార్డుల్లో, లక్సెట్టిపేటలో 1 వార్డులో నామినేషన్‌ వేసిన సీపీఐ శ్రేణులు ఆయా మున్సిపాలిటీల్లో ఎవరితో పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలతో కామ్రేడ్‌ల పొత్తు

మంచిర్యాలలో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు..

క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్‌తో ఖరారు

బెల్లంపల్లిలో తుది ప్రయత్నాలు

బెల్లంపల్లి: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలతో వేర్వేరుగా జత కలిసి పోటీ చేయడానికి సీపీఐ సిద్ధమైంది. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌, బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్‌, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో ఒక్కోచోట ఒక్కో పార్టీతో పొత్తుకు సానుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. మంచిర్యాలలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేయనుండగా.. క్యాతనపల్లిలో కారెక్కడం ఖాయమైంది. బెల్లంపల్లిలో పొత్తుకు తుది ప్రయత్నాల్లో ఉన్నారు. చెన్నూర్‌, లక్సెట్టిపేటలో ఒంటరిగా పోటీకి సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహపూర్వకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ పార్టీ మంచిర్యాలలో తప్ప చెన్నూర్‌, బెల్లంపల్లి బల్దియాల్లో కమ్యూనిస్టులతో చెలిమికి నిరాకరించడంతో పొత్తుకు తలుపులు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు స్నేహహస్తం అందించి పొత్తుకు ముందుకు రాగా, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వంతోపాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ మొండిచేయి చూపినట్లు సీపీఐ శ్రేణులు చెబుతున్నారు. ఇ దే అదునుగా కామ్రేడ్లతో పొత్తుకు బీఆర్‌ఎస్‌ ముందుకు రావడంతో పొత్తులు ఒక్కసారిగా మలుపులు తిరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని సీపీఐ, బీఆర్‌ఎస్‌ పొత్తుకు సిద్ధపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సీట్ల ఒప్పందం ఇలా..

‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ1
1/2

‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ

‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ2
2/2

‘చేయి’ కలిపి ‘కారు’లో సీపీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement