గడ్డంగూడ గుడిసెల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

గడ్డంగూడ గుడిసెల తొలగింపు

Jan 29 2026 6:41 AM | Updated on Jan 29 2026 6:41 AM

గడ్డంగూడ గుడిసెల తొలగింపు

గడ్డంగూడ గుడిసెల తొలగింపు

జన్నారం: జన్నారం రేంజ్‌ పరిధిలోని గడ్డంగూడలో గిరిజనులు, గిరిజనేతరులు అక్రమంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటుండగా.. బుధవారం అటవీశాఖ అధికారులు తొలగించారు. ఎఫ్‌డీవో రామ్మోహన్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అటవీ సిబ్బంది, డివిజన్‌లోని ఇందన్‌పల్లి, జన్నారం, తాళ్లపేట్‌ రేంజ్‌ అధికారులు లక్ష్మీనారాయణ, సుష్మారావు, కే.లక్ష్మీనారాయణ, సిబ్బంది మూకుమ్మడిగా జేసీబీలతో తెల్లవారు జామున ఐదు గంటలకు గుడిసెలను కూల్చివేశారు. అటవీ భూమి చుట్టూ కంచెలు తవ్వించారు. గుడిసెలు వేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్‌డీవో రామ్మోహన్‌ మాట్లాడుతూ అటవీ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకోవడం చట్టవిరుద్ధమని, మరోసారి గుడిసెలు వేసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడిసెలు వేసుకోవడానికి కారణమైన బలరామ్‌పై అరెస్ట్‌ వారెంట్‌ ఉందని, తప్పించుకుని తిరుగుతున్నాడని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement