ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి

Jan 29 2026 6:41 AM | Updated on Jan 29 2026 6:41 AM

ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి

ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి

ఆదిలాబాద్‌టౌన్‌: బొమ్మలు, ఆటల ఆధారిత బోధనతో పిల్లల సమగ్రాభివృద్ధి చెందుతారని పీఎంశ్రీ పాఠశాలల శిక్షణ రిసోర్స్‌పర్సన్‌ మా దరి ఎల్లన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డైట్‌ కళాశాలలో ఉమ్మడి జిల్లా పరిధిలోని పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొమ్మలు, ఆటలను ఉపయోగించి బోధిస్తే పిల్లల సమగ్ర నైపుణ్యాలు, అభిజ్ఞ, శారీరక, సామాజిక, భావోద్వేగాభివృద్ధి చెందుతాయని తెలి పారు. తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో అన్వేషణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేర్చుకున్నది ఆటల ద్వారా అనుభవంగా మారడంతో పట్టు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ హై, వైస్‌ప్రిన్సిపాల్‌ కిరణ్‌కుమార్‌, రిసోర్స్‌పర్సన్లు సురేశ్‌, విజయ్‌, వెంకటేశ్‌, నాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement