ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

Feb 3 2026 7:51 AM | Updated on Feb 3 2026 7:51 AM

ఉరేసు

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

భీమిని: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కన్నెపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల మేరకు కన్నెపల్లి మండలం నాయకునిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడెంకు చెందిన సోండ్ల భీమయ్య, కాంతల దంపతుల కుమారుడు సోండ్ల శంకర్‌ (26) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. మద్యం మానేయాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఒంటికి నిప్పంటించుకుని యువకుడు..

మామడ: మండలంలోని న్యూసాంగ్వి గ్రామానికి చెందిన పోతగంటి సంతోష్‌ (26) సోమవారం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపాధికోసం దుబాయ్‌ వెళ్లిన సంతోష్‌ ఐదురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మానసికస్థితి సరిగా లేనికారణంగా ఇంట్లో ఎవరులేని సమయంలో ఒంటికి నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా ఈఎంటీ శేఖర్‌ ప్రాథమిక చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

‘బడ్జెట్‌లో బడుగులకు తీరని అన్యాయం’

తాండూర్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దశ, దిశ నిర్ధేశం లేని ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం శోచనీయమన్నారు. ఈ బడ్జెట్‌ను సీఐటీయూ తరపున వ్యతిరేకిస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్టదశకు చేరుకున్న ఈ సందర్భంలో ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభ భారాన్ని కార్మికులు, సామాన్య ప్రజలపై నెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాయకులు నానయ్య, శంకర్‌, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య1
1/1

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement