ఎన్నికల నియమావళి పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళి పాటించాలి

Jan 30 2026 6:43 AM | Updated on Jan 30 2026 6:43 AM

ఎన్ని

ఎన్నికల నియమావళి పాటించాలి

లక్సెట్టిపేట/బెల్లంపల్లి: ప్రతి ఒక్కరూ ఎన్ని కల నియమావళి పాటించాలని, సమయం ముగిసిన తర్వాత నామినేషన్లు తీసుకోవద్దని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య, ఎన్నికల పరిశీలకులు గంగాధర్‌ వేర్వేరుగా పరిశీలించారు. అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలను పరిశీలించి తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న హెల్ప్‌ డెస్క్‌ సిబ్బంది అభ్యర్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసి సహాయ పడాలని సూచించారు. నామినేషన్‌ పత్రం పూర్తి చేయడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో సరోజ, బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ పాల్గొన్నారు.

జాతరలో అడుగడుగునా నిఘా

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో సమ్మక్క జాతరలో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. జాతర జరిగే ప్రాంతం, భక్తులు బస చేసే ప్రాంతాలు పూర్తిగా పోలీసుల భద్రత వలయంలో ఉన్నాయి. 20 అధునాతన కెమెరాలు, సుమారు ఐదు వందల మీటర్ల దూరం నుంచి రికార్డు అయ్యే సామర్థ్యం కలిగిన కెమెరాలు అమర్చారు. వెయ్యి మంది పోలీస్‌ సిబ్బందితోపాటు మిమ్స్‌, సీవీ రామన్‌ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు వంద మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. 24గంటలు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీఐ స్థాయి అధికారి జాతర ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నికల నియమావళి పాటించాలి1
1/1

ఎన్నికల నియమావళి పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement