గూడెం గుట్టలో కల్యాణ వైభోగం
దండేపల్లి: తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం లోని గూడెం గుట్టపై వెలసిన శ్రీసత్యనారాయణస్వామి–రమాదేవి కల్యాణోత్స వం శుక్రవారం రాత్రి కనుల పండువగా జరిగింది. వేద పండితులు నారాయణశర్మ, భరత్‌శర్మ, ప్రధా న అర్చకులు రఘుస్వామి, సంపత్‌స్వామి వేదమంత్రోచ్ఛరణలతో స్వామివారి కల్యాణాన్ని కమణీయంగా జరిపించారు. ఈవో శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణీ కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
గూడెం గుట్టలో కల్యాణ వైభోగం


