వ్యక్తిత్వాన్ని బట్టి ఓటేసేవారు
నేను 1987లో మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు నన్ను కేవలం వ్యక్తిత్వం ఆధారంగానే గెలిపించారు. ఎన్నికలంటే మందీ మార్బలంతో ప్రచారం నిర్వహించేందుకు చేసే ఖర్చు తప్ప, ఇతర ఖర్చులేవి ఉండేవి కావు. రూ.20 వేల లోపు మాత్రమే ఖర్చు అయ్యే ఎన్నికలు 1995లో రూ.1.50 లక్షల ఖర్చుతో ప్రజలు గెలిపించారు. 2020లో ఖర్చు 20 రెట్లు పెరిగింది. ప్రస్తుతం 30 రెట్లు పెరిగి రాజకీయాలంటేనే ఖర్చు అనే స్థితికి వచ్చింది.
– పెంట రాజయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్
ఖర్చుతో కూడుకున్నవి
మొదటిసారి 2000 సంవత్సరంలో కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పుడు ఖర్చు రూ.30 వేలు. 2005లో రెట్టింపు అయ్యింది. 2020లో పదింతలు అయ్యింది. వార్డులోని ప్రజలతో ఎప్పటికప్పుడు మాట్లాడి, వారి సమస్యలను తీర్చేందుకు ముందుండడం వల్ల గెలుపు సులభతరంగా మారింది. ప్రస్తుత కాలంలో ఎన్నికల వ్యయం అనుకున్న దానికంటే ఎక్కువవుతోంది. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయింది.
– బుద్దార్థి రాంచందర్,
మాజీ కౌన్సిలర్, మంచిర్యాల
వ్యక్తిత్వాన్ని బట్టి ఓటేసేవారు


