హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కాగజ్‌నగర్‌టౌన్: దహెగాం మండలంలోని రాళ్ళగూడకు చెందిన ఆత్మకూరి కళావతి గురువారం అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆత్మకూరి కళావతి అదే గ్రామానికి చెందిన వగాడే బడేరామ్ వద్ద రూ.40 వేలు అప్పుగా తీసుకుంది. డబ్బుల విషయంలో కొన్ని రోజుల క్రితం జరిగిన గొడవల్లో బడేరామ్ ఎప్పటికై నా చంపుతానని బెదిరించాడు. ఈనెల 28న మృతురాలు ఇట్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లివస్తుండగా బడేరామ్ ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. సదరు మహిళ కిందపడడంతో చీరకొంగుతో గొంతుచుట్టు చుట్టి గొంతునులిమి హత్యచేసి సమీపంలోని పత్తి చేనులో పడేశాడు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.


