హోరాహోరీగా ఎస్టీపీపీ క్రికెట్‌ లీగ్‌ | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఎస్టీపీపీ క్రికెట్‌ లీగ్‌

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

హోరాహోరీగా ఎస్టీపీపీ క్రికెట్‌ లీగ్‌

హోరాహోరీగా ఎస్టీపీపీ క్రికెట్‌ లీగ్‌

జైపూర్‌:మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటులో 12వ సీజన్‌ క్రికెట్‌ లీగ్‌ ఫైనల్‌ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఉదయం సింగరేణి, పీఎంపీఎల్‌ హెచ్‌వోడీల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో సింగరేణి హెచ్‌వోడీల జట్టు, పీఎంపీఎల్‌ హెచ్‌వోడీ జట్టుపై విజయం సాధించింది. సింగరేణి హెచ్‌వోడీ జట్టుకి ఎస్టీపీపీ ఈడీ చిరంజివి నాయకత్వం వహించారు. అనంతరం ఫైనల్‌కు చేరుకున్న పీఎంపీఎల్‌ ఽథండర్‌ టైటాన్స్‌, సీఐఎస్‌ఎఫ్‌ జట్ల మధ్యన ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన థండర్‌ టైటాన్స్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా థండర్‌ టైటాన్స్‌ బాట్స్‌ మాన్‌ ముకేశ్‌ బాబు 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సీఐఎస్‌ఎఫ్‌ జట్టు 120 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బౌలింగ్‌లో ముకేశ్‌బాబు 2 వికెట్లు తీసి మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. థండర్‌ టైటాన్స్‌ జట్టుకు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, చీఫ్‌ కోఆర్డినేటర్‌ పంతులా, సుబ్బారావు ట్రోఫీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement