నేడు గూడెంలో సత్యదేవుడి కల్యాణం
దండేపల్లి: తెలంగాణ అన్నవరంగా పేరొందిన మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 27నుంచి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. శుక్రవారం సా యంత్రం సత్యనారాయణస్వామి–రమాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాన్ని ముస్తాబు చేయడంతోపాటుగా రంగు రంగుల విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరించారు. గుట్టపై ప్రధాన ఆలయం పక్కనున్న సామూహిక సత్యనారాయణ వ్రత మండపంలో కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు. 10వేల మంది భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని, అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించాలని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ కోరారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా సప్తాహ భజన కార్యక్రమాలు గురువారం కొనసాగాయి.


