బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం
లక్సెట్టిపేట/బెల్లంపల్లి/చెన్నూర్/మంచిర్యాలక్రైం: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్ బార్ అసోసియేషన్ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. లక్సెట్టిపేటలో జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బార్ అసోసియేషన్‌లో 45మంది ఓటర్లు ఉండగా 43 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రదీప్‌కుమార్, ఇంచార్జిగా సూపరింటెండెంట్ శ్రీనివాస్ వ్యవహరించారు. బెల్లంపల్లిలో 57మంది సభ్యులకు గాను 52మంది ఓటు హక్కు వేశారని ఎన్నికల అధికారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం రవికుమార్ తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి జే.ముకేష్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. చెన్నూర్‌లో 26 మంది ఓటర్లకు గాను 23మంది ఓటు వేశారు. స్థానిక సివిల్ జడ్జి రవి, సూపరింటెండెంట్ జాఫర్ పర్యవేక్షించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పోలింగ్ అధికారి మద్ది కార్తీక్, న్యాయవాదులు పాల్గొన్నారు. మంచిర్యాలలోని బార్ అసోసియేషన్‌లో 376మంది ఓటర్లకు గాను 315మంది ఓటు వేశారు. ఎన్నికల పరిశీలకులుగా స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోషా, అిసిస్టెంట్‌గా ఉషారాణి, ఎన్నికల అధికారిగా స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ వ్యవహరించారు.


