ఖజానా ఖాళీ చేసిన గత ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఖజానా ఖాళీ చేసిన గత ప్రభుత్వం

Jan 28 2026 8:27 AM | Updated on Jan 28 2026 8:27 AM

ఖజానా ఖాళీ చేసిన గత ప్రభుత్వం

ఖజానా ఖాళీ చేసిన గత ప్రభుత్వం

● మంత్రి వివేక్‌ వెంకటస్వామి ● అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చెన్నూర్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి కాగితాలే అప్పగించిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో నియోజకవర్గంలో జరిగి న అభివృద్ధి శూన్యమని, వివిధ పనులకు ప్రొసీడింగ్‌లు ఇచ్చి నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పా రు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని తెలిపారు. 14వార్డుకు ఇప్పటివరకు రూ.3కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చె ప్పారు. భవిష్యత్‌లో మున్సిపల్‌ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి వెంట మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణ, కాంగ్రెస్‌ నాయకులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement