కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి

కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి

మంచిర్యాలటౌన్‌: మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం మానుకోవాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ సూచించారు. కేసీఆర్‌పై సిట్‌ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి ప్రధాన రహదారుల గుండా బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల గెలుపుతో, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదని కాంగ్రెస్‌ కేసీఆర్‌పై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, పార్టీ నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement