ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ విధానం అమలు చేయాలి
భీమారం: ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ విధానంతో విద్యార్థులకు అనేక విధాలుగా మేలు జరుగుతుందని, జిల్లాలోని ప్రతీ పాఠశాలలో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ కోఆర్డి నేటర్ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం భీమారంలో నిర్వహించిన మండల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో నూతన విద్యావిధానం అమలు దృష్ట్యా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితశాస్త్రంలో మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రతీ పాఠశాలలో పూర్తి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలను ఎఫ్‌ఎల్‌ఎస్‌లో పూర్తి చేయాలని కోరారు. సెక్టోరియల్ ఆధికారి భరత్, రిసోర్స్‌పర్సన్లు కుమార్, స్వ రూప, శ్రీనివాస్, సీఆర్పీ సాగర్ పాల్గొన్నారు.


