డ్రంకెన్ డ్రైవ్ కేసులో పదిరోజుల జైలు
భీమారం: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన పోలంపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ పున్నంకు మంగళవారం చెన్నూ ర్ మున్సిఫ్‌కోర్టు న్యాయమూరి పర్వతపు రవి పదిరోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా పదేపదే 100 నంబర్‌కు కాల్‌చేసి పోలీసుల సమయాన్ని వృధా చేస్తున్నాడన్నారు. నిందితుడిని లక్సెట్టిపేట సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
బస్సులో నుంచి కిందపడి
ఒకరికి గాయాలు
కోటపల్లి: మండలంలోని రావులపల్లికి చెందిన శేఖర్ మంగళవారం మధ్యాహ్న ం చెన్నూర్ నుంచి కొల్లూర్‌కు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. కొల్లూర్ స్టేజీ వద్ద బస్సు ఆపాలని ఎంతమొత్తుకున్నా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయా డు. స్టేజీ దాటాక బస్సు స్లో చేయడంతో దిగే క్రమంలో జారి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.
దేశీదారు విక్రయిస్తే జైలుకే..
తలమడుగు: దేశీదారు విక్రయిస్తే జైలుశిక్ష త ప్పదని ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ రెడ్ల విజయేందర్ అన్నారు. మంగళవారం మండలంలోని కుచులాపూర్‌లో దేశీదారు విక్రయిస్తున్న నింది తుడిని పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా దర్శనాల సాయినాథ్ వద్ద 96 దేశీదా రు బాటిళ్లు లభ్యమైనట్లు తెలిపారు. వాటి విలు వ దాదాపు రూ.3,840 ఉంటుందన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రెచ్చగొట్టేలా పోస్టుపెట్టిన వ్యక్తి అరెస్ట్
కై లాస్‌నగర్(బేల): మతాల మధ్య చిచ్చుపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేల మండలం చెప్రాలకు చెందిన బొట్ల వంశీయాదవ్ తన వ్యక్తిగత ఇన్‌స్రాగ్రామ్ అకౌంట్‌లో మతాల మధ్య చిచ్చుపెట్టేలా పోస్టు చేశాడని మండల కేంద్రానికి చెందిన హుజూర్ ఖాన్ బేల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. సమావేశంలో బేల ఎస్సై ఎల్.ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.


