ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

ఎన్ని

ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’

నామినేషన్‌ కేంద్రం

ఆరుబయట సిబ్బంది కోసం భోజనాలు

మృతదేహం తీసుకెళ్తున్న కుటుంబీకులు

లక్సెట్టిపేట: ఎన్నికల ఫలితాల్లో గెలుపోటములపై అభ్యర్థులు పోస్టుమార్టం చేస్తుంటారు. కానీ.. ఇక్కడ ఎన్నికల కేంద్రం పక్కనే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. యాదృచ్ఛికమే అయినా ఆసక్తికరంగా మారింది. లక్సెట్టిపేటలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం నామినేషన్‌ ఉపసంహరణ, స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇరవై రోజులుగా ఎన్నికల కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగుతున్నాయి. ఇదే భవనంలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి కొనసాగింది. ఆస్పత్రికి నూతన భవనం నిర్మించడంతో ఇటీవల ప్రారంభించి అందులోకి మార్చారు. మార్చురీ భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడ ఉన్న మార్చురీ గదిలోనే మృతదేహాలను భద్రపరుస్తూ పోస్టుమార్టం చేస్తున్నారు. మంగళవారం దండేపల్లి మండలం రాసపెల్లి గ్రామానికి చెందిన మృతదేహాన్ని ఇక్కడే భద్రపర్చి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి ఆరుబయటనే భోజనాలు వడ్డిస్తున్నారు.

ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’1
1/2

ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’

ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’2
2/2

ఎన్నికల కేంద్రం.. ‘పోస్టుమార్టం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement