మద్యం పట్టివేత
భైంసాటౌన్: అక్రమంగా మద్యం విక్రయిస్తు న్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాయికుమార్ తెలిపారు. రాజీవ్‌నగర్‌కు చెందిన రాసేట్కర్ బండు ఖడ్డా ప్రాంతంలోని తన హోటల్‌లో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో రూ.5,290 విలువైన 7.29 లీటర్ల మ ద్యం లభించినట్లు చెప్పారు. అలాగే, హ నుమాన్‌నగర్‌లోని ఫైర్‌స్టేషన్ పక్కన కొండపల్లి నగేశ్‌కు చెందిన కిరాణా దుకాణంలో తని ఖీ చేయగా, రూ.9620 విలువైన 9.44 లీటర్ల మ ద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


