15 ఏళ్లయిన పాలన సాగలే!
నిర్మల్ జిల్లాలో 15 ఏళ్ల క్రితం రూ.50 లక్షలతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని సెప్టెంబర్ 23, 2010లో అప్పటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికీ ఆ భవనంలో పరిపాలనకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. పాత మున్సిపల్ కార్యాలయ భవనం పెచ్చులూడుతున్నా అందులోనే పరిపాలన కొనసాగిస్తున్నారు. దాదాపు ముగ్గురు చైర్మన్లు మారినప్పటికీ నూతన భవనంలో వాస్తు దోషం ఉందంటూ పాత భవనంలో పాలన కొనసాగిస్తూ ఉండడం కొసమెరుపు. ప్రస్తుత భవనం పగుళ్లు తేలి, స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయి. దీంతో ఎప్పుడు కూలుతుందోనని అందులో పనిచేసే సిబ్బంది భయపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఏర్పడే నూతన పాలకవర్గమైనా కొత్త భవనంలో పరిపాలన కొనసాగించాలని జిల్లావాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
15 ఏళ్లయిన పాలన సాగలే!


