పీఎంశ్రీపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన ఎంపీ
ఆదిలాబాద్: ప్రధాన మంత్రి (పీఎంశ్రీ) పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయనే అంశంపై ఎంపీ గోడం నగేష్ సోమవారం పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ పథకం అమలుపై ఇప్పటివరకు నిర్వహించిన మూల్యాంకన వివరాలు ఏమిటని, భవిష్యత్‌లో మరిన్ని పాఠశాలలకు ఈ పథకాన్ని విస్తరించే ఆలోచన ఉందా? అని అడిగారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించి భవిష్యత్‌లో మరిన్ని పాఠశాలలను ఈ పథకంలో చేర్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా పీఎం శ్రీ పథకాన్ని మరింత విస్తరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.


