అప్పులు తీర్చే మార్గంలేక ఒకరు..
మంచిర్యాలక్రైం: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు చున్నంబట్టి వాడలోని నాగదేవత కాలనీకి చెందిన మల్యాల చిరంజీవి(46) కొంతకాలంగా ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో కుటుంబ అవసరాలకోసం స్నేహితుల వద్ద రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. తీర్చే మార్గం లేకపోవడంతో బాధపడుతూ ఉండేవాడు. మంగళవారం ఇంట్లో ఎ వరూలేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


