వేలాలలో గట్టు మల్లన్న గిరిప్రదక్షిణ
జైపూర్: మండలంలోని వేలాల గట్టు మల్లన్నస్వామి సన్నిధిలో శుక్రవారం 17వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ప్రతీనెల ఆరుద్ర నక్షత్రాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేశ్ ఆత్మారాం మహరాజ్ ఆధ్వర్యంలో ఉదయం గిరి ప్రదక్షిణ చేపట్టగా ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డేగ స్వప్న నగేశ్, భక్తులు పాల్గొన్నారు.
రంజీ ట్రోఫీలో
హిమతేజ సెంచరీ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ యువ క్రికెటర్ హిమతేజ రంజీ ట్రోఫీలో మరోసారి మెరిశాడు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి ఎంపికై న ఈ యువ కెరటం హైదరాబాద్ తరపున ఆడుతూ ఛత్తీస్‌గఢ్ జట్టుపై 125 పరుగులతో విజేతగా నిలిచాడు. ఛత్తీస్‌గఢ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 238కి ఆలౌట్ అయ్యింది. హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేయగా అందులో హిమతేజ 207 బాల్స్‌లో 125 పరుగులు సా ధించి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో మరో సారి పతకం సాధించడంపై కోచ్ జయేంద్ర పటాస్కర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
వేలాలలో గట్టు మల్లన్న గిరిప్రదక్షిణ


