యువకుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై
దిలావర్‌పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రామ సమీపంలో నిర్మల్–భైంసా రహదారిని ఆనుకుని ఉన్న కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఎస్సై రవీందర్ కాపాడారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సిర్గాపూర్ కుంటలో మునిగి తేలుతూ కనిపించిన గుర్తుతెలి యని వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఎస్సై ఘటనాస్థలికి చేరుకుని స దరు యువకుడిని కుంటలోనుంచి బయటకు తీశా రు. యువకుడి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేంపల్లికి చెందిన కుటుంబం రెండుమూడు రోజులుగా సిర్గాపూర్ గ్రామ బస్టాండ్ ప్రాంతంలో ఉంటుందని ఎస్సై తెలిపారు. వీరంతా గ్రామాల్లో యాచిస్తారని పేర్కొన్నారు. సదరు కుటుంబానికి చెందిన ఫారూఖ్ తన తల్లిదండ్రులతో వివాదం పెట్టుకుని కుంటలోకి దూకినట్లు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సదరు యువకుడిని కాపాడినట్లు పేర్కొన్నారు. అతడితోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి వారి స్వస్థలానికి పంపినట్లు తెలిపారు.


