ఉట్నూర్‌రూరల్: విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ నేర్చుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ పీఎమ్మార్సీ భవనంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేతో పాటు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 రకాల అంశాలలో కాంపిటీషన్‌లలో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తానుకూడా డిగ్రీ చదివేటప్పుడు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినేనని గుర్తు చేసుకున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించడం సులభం అన్నారు. వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేట్, స్కిల్స్, లీడర్షిప్ కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


