మందమర్రిరూరల్: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. సారంగపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో చేతికి అందే ఎత్తులో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. పన్నేండేళ్ల క్రితం చిర్రకుంట నివాసి రాజు తన పొలంలోంచి వరి నారును మరోచోటకు తీసుకెళ్తుండగా వేలాడే విద్యుత్ తీగలకు తగిలి కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో పలు షాపుల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలకు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పైపులు తొడిగారు. రెండో అంతస్తుకు వెళ్లాలంటే కొన్నిచోట్ల విద్యుత్ తీగలకు తొడిగిన పైపులు తగిలే ప్రమాదం లేకపోలేదు.


