చెన్నూర్‌రూరల్: మండలంలోని కత్తెరసాల గ్రామంలో విద్యుత్ స్తంభానికి అమర్చిన మినీ ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ తీగలు ప్రమాదకరంగా మారాయి. రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, అటుగా వెళ్లేవారు దానిని తాకే ప్రమాదముంది. అలాగే, తుర్కపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభం ఇంటి పక్కనే ఒక వైపునకు వంగింది. గాలిదుమారాలు వస్తే స్తంభం పడిపోయే ప్రమాదముంది. గతంలో పలుసార్లు ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


