చెన్నూర్: పారిశుద్ధ్య నిర్వహణ పనులు పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం కలెక్టర్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన పారిశుద్ధ్య పనులు, వంద పడకల ఆస్పత్రి పనులు, స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అ నంతరం తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశం బోధించారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ తప్పకుండా పాటించాలని సూచించారు. మున్సిప ల్ కమిషనర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉదయ్‌కుమార్, ఆయా శాఖల అధికారులున్నారు.
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. జనాభా లెక్కల ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగం, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
దండేపల్లి: మండలంలో కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. కొర్విచెల్మలో మెగా గాలికుంటు నిర్మూలన శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని డైనేజీలు, నర్సరీని పరిశీలించారు. స ర్పంచ్ సోనియా, ఉపసర్పంచ్ తిరుపతి, ఎంపీడీవో ప్రసాద్, మండల పశువైద్యాధికారి ధన్‌రాజ్, సి బ్బంది పాల్గొన్నారు. అలాగే, ద్వారక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో చేపట్టిన హాస్టల్ భవన నిర్మాణ పనులు, గోదావరి పుష్కరఘాట్‌ను పరిశీలించా రు. వెల్గనూర్ గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని సూచించారు. రెబ్బనపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆరోగ్య ఉ పకేంద్రాన్ని తనిఖీచేశారు. గూడెం గ్రామాన్ని సందర్శించి డ్రైనేజీలు పరిశీలించారు. అనంతరం గుట్టపై కి ఎక్కి పార్కింగ్ స్థలాల గురించి చర్చించారు. ఖాళీ ప్రదేశాల్లో వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో కేవీ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


