బెల్లంపల్లి: మున్సిపాలిటీలో 34 వార్డులుండగా దాదాపు ప్రతీ వార్డులో కరెంట్ తీగల సమస్య ఉంది. కన్నాల బస్తీ, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, హన్మాన్ బస్తీ, బూడిదగడ్డ, నంబర్ 2 ఇంక్లైన్, శాంతిఖని, 65డీప్ ఏరియా, బెల్లంపల్లి బస్తీ, పోస్టాఫీస్ బస్తీ తదితర కార్మిక వాడలు, కార్మికేతర ప్రాంతాలైన షంషీర్ నగర్, ఇంక్లైన్ రడగంబాలబస్తీ, అంబేడ్కర్ నగర్, గంగారాం నగర్, రాంనగర్, అశోక్‌నగర్, బాబుక్యాంపు బస్తీల్లో ఇళ్ల మీదుగా విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. బస్తీల్లో కరెంట్ లైన్‌లు సవరించడంలేదు. కంపెనీ ఏరియాల్లో కరెంట్‌లైన్‌ల సమస్య తీవ్రంగా ఉంది. వేలాడుతు న్న విద్యుత్ తీగలు సవరించాలని పలు బస్తీల ప్ర జలు ఫిర్యాదు కోరుతున్నా ఫలితం ఉండడంలేదు. కాగా, కొత్తబస్టాండ్ ఏరియాలో నాలుగేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పు పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప నిచ్చెన కరెంట్ తీగలకు తగలడంతో షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.


