బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం రెండోరోజు అంతఃప్రజ్ఞ 2కే–26 నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయానికి దారితీసిన పట్టుదల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్‌ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఈ.మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ స్వప్నిల్ జంగలే విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో నినా ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్‌వర్క్, పిల్లల కోసం రూపొందించిన ఏఐ ఆధారిత లెర్నింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో స్మార్ట్ వాటర్ ఫ్లో అండ్ పైప్‌లైన్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్, స్మార్ట్ డ్రగ్ డిస్పెన్సర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో హెలియో ఆక్వా రిఫైనర్ , ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వంటి ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో క్వాంటం కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ విజేతగా నిలిచింది.
బహుమతులు అందజేత
అంత ప్రజ్ఞలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బహుమతులు అందజేశారు.


