కై లాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవి ష్కరణలను వెలికితీసి వాటిని వ్యాపార మార్గాలుగా మలిచేందుకు యువత ముందుకు రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది కి పైగా యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, పర్యావరణహి త ఇంధన వనరులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ అభివృద్ధి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న ప్రతిభను వెలికితీయాల్సిన అవసరముందన్నారు. స్థానికంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు ప్రో త్సాహం అందించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆవిష్కర్తలతో ప్రత్యక్షంగా చర్చించి వారి ఆలోచనలను మరింత మెరుగుపరుచుకునేలా మార్గనిర్దేశం చేసింది. ఐడియా వ్యాలిడేషన్, ప్రోటోటైపింగ్, గో టు మార్కెట్ స్ట్రాటజీ, నిధుల సమీకరణ, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఈడీఎం రవి, రెడ్కో డీఎం శ్రీనివాస్, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ నికినీ వర్మ, టీజీఐసీ ప్రతినిధులు ప్రణయ్, రమేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


