కాసిపేట: మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిని శనివారం ఆసిఫాబాద్ డీఎఫ్‌వో నీరజ్ టిబ్రేవాల్ ఐఎఫ్‌ఎస్ సందర్శించారు. గని మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు ఆయన ను శాలువాలతో సత్కరించారు. అనంతరం మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పనిస్థలాల వద్దకు వెళ్లారు. గనిలో బొగ్గు ఉత్పత్తి, మిషన రీ పనితీరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఐ టీయూసీ పిట్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఐఎన్‌టీయూసీ సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణ్‌దాస్, రక్షణాధికారి నిఖిల్, డెప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమాధికారి మీర్జాగౌస్‌జీషాన్, సర్వేయర్ ప్రభాకర్, టీబీజీకేఎస్ నాయకులు అఫ్జలు ద్దీన్, తదితరులు పాల్గొన్నారు.


