తానూరు: మండలంలోని భోసి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. గ్రామానికి చెందిన అర్ధాపూర్ గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మరో ఇంట్లో పడుకున్నారు. గుర్తు తెలి యని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. గంగాధర్ ఇంట్లో బీరువాలో ఉన్న రూ.79 వేలు, సాయినాథ్ గౌడ్ ఇంట్లో రూ.వెయ్యి నగదు అపహరించారు. శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ముధోల్ సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై షేక్ జుబేర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


