భీమారం: మంచిర్యాల–చెన్నూర్ జాతీయ రహదారిపై కుందారం ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు మండలం మాదారంకు చెందిన ఏరుకొండ వెంకటేశ్ చెన్నూర్‌లో ఉన్న తన తల్లిని చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కుందారం ఎక్స్‌రోడ్డు వద్దకు రాగానే చెన్నూర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఘటనలో బైక్ నడుపుతున్న వెంకటేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. జాతీయరహదారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులు 108 కి సమాచారం అందించారు. పైలట్ హరీశ్, ఈఎంటీ రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


