తాత మందలించాడని కోపంతో శనగ పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

తాత మందలించాడని కోపంతో శనగ పంట దగ్ధం

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

సాత్నాల: జులాయిగా తిరగొద్దు, మద్యం మానేయాలని తాత మందలించాడని కోపంతో మనుమడు శనగ పంటను దగ్ధం చేశాడు. భోరజ్‌ మండలం పెండల్‌వాడ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై పవర్‌ గౌతమ్‌ కథనం ప్రకారం.. పెండల్‌వాడ గ్రామానికి చెందిన లాంగ్డే ప్రభాకర్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్నవాడు సంతోష్‌ అతని వద్ద ఉంటున్నాడు. సంతోష్‌ కుమారుడు సునీల్‌ మద్యానికి బానిసై, జులాయిగా తిరుగుతున్నాడు. తాత ప్రభాకర్‌ మందలించడంతో మనుమడు సునీల్‌ కోపం పెంచుకున్నాడు. వీరికి రెండెకరాల పొలం ఉండగా, ఈ ఏడాది మరో 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. సరిగ్గా దిగుబడి రాకపోయేసరికి 4 ఎకరాల్లో శనగ వేయగా కోతదశకు రాగా, కోసి కుప్పలుగా వేశారు. ఆదివారం శనగ దగ్ధమై కనిపించచడంతో ప్రభాకర్‌ లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్‌ను విచారించగా నేరం అంగీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాలిపోయిన శనగ పంట విలువ దాదాపు రూ.2 లక్షలు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement